Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:27 PM

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

25-06-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో వెలిమినేడు, గుండ్రంపల్లి, ఏపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలు వెలుగుచూశాయని నాయకులు తెలిపారు.

పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు అందలేదని, ఉదయం అందించాల్సిన జావా కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించి, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, శశికుమార్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News