Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:30 PM

సమస్యల వలయాల్లో సరస్వతి నిలయాలు. భువనగిరి కేజీబీవీలో నీటి కష్టాలు

25-06-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అధికారుల సందర్శనలే తప్ప.. పరిష్కారం శూన్యం

భువనగిరి: జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో తాగు, వినియోగ నీటి సమస్య విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సుమారు 300 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్న ఈ విద్యాలయంలో నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

గతంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో అప్పటి ఆర్డీవో భూపాల్‌రెడ్డి ప్రభుత్వ నిధులతో బోరు వేయించినప్పటికీ, అది వర్షాకాలంలో మాత్రమే అవసరాలను తీర్చగలుగుతోందని చెబుతున్నారు. ఎండాకాలం ప్రారంభమైతే మళ్లీ నీటి సమస్య తలెత్తుతోందని వాపోతున్నారు.

పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు గడిచినా, వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో నీటి కొరత మరింత తీవ్రమైందని తెలుస్తోంది. స్నానాలు, ఇతర అవసరాలకు తగినంత నీరు అందక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. కొందరు విద్యార్థినులు ఆరోగ్య సమస్యల కారణంగా సెలవులు పెట్టుకుని ఇళ్లకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇందిరమ్మ కాలనీతో పాటు కేజీబీవీకి ప్రత్యేకంగా ట్యాంకర్లను కేటాయించినప్పటికీ, నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పలువురు పాఠశాలను సందర్శించినా సమస్య మాత్రం యథాతథంగానే ఉందని స్థానికులు అంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థినులకు తగిన నీటి వసతి కల్పించాలని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని బాలికలు, తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు.

Sthanikam

సమస్యల వలయాల్లో సరస్వతి నిలయాలు. భువనగిరి కేజీబీవీలో నీటి కష్టాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News