Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:33 PM

ఆర్టీసీ నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు. కర్నూలు–ఆదోని మార్గంలో అదనపు సర్వీసులు కోరిన నాయకులు

25-06-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: కర్నూలు జిల్లా కేంద్రం నుంచి ఆదోని ప్రాంతానికి తగినన్ని బస్సులు నడపకపోవడం దురదృష్టకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ విమర్శించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం ప్రాంతాలకు చాలా తక్కువ బస్సులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. దీంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

కర్నూలు నుంచి ఇతర జిల్లాల ప్రాంతాలకు తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ, సొంత జిల్లాలోని ఆదోని ప్రాంతానికి సరిపడా సర్వీసులు లేకపోవడం వివక్షపూరిత ధోరణిగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు వెంటనే అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే కర్నూలు బస్సు స్టాండ్ ఇరుకుగా మారిందని, రద్దీ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు స్టాండ్‌ను విస్తరించడమో, లేక ఆదోని రోడ్డువైపు తరలించడమో చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీ నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు. కర్నూలు–ఆదోని మార్గంలో అదనపు సర్వీసులు కోరిన నాయకులు

Article Image

ఆదోని,: కర్నూలు జిల్లా కేంద్రం నుంచి ఆదోని ప్రాంతానికి తగినన్ని బస్సులు నడపకపోవడం దురదృష్టకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ విమర్శించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం ప్రాంతాలకు చాలా తక్కువ బస్సులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. దీంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

కర్నూలు నుంచి ఇతర జిల్లాల ప్రాంతాలకు తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ, సొంత జిల్లాలోని ఆదోని ప్రాంతానికి సరిపడా సర్వీసులు లేకపోవడం వివక్షపూరిత ధోరణిగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు వెంటనే అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే కర్నూలు బస్సు స్టాండ్ ఇరుకుగా మారిందని, రద్దీ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు స్టాండ్‌ను విస్తరించడమో, లేక ఆదోని రోడ్డువైపు తరలించడమో చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News