Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

డ్రగ్స్‌కు నో.. జీవితానికి యెస్ అంటూ యువత ప్రతిజ్ఞ

25-06-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు భారీ యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొని మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజంలో అవగాహన పెంచాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. "డ్రగ్స్‌కు నో... జీవితానికి యెస్" అనే నినాదంతో విద్యార్థులు ప్రతిజ్ఞ చేయగా, మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.

Sthanikam

డ్రగ్స్‌కు నో.. జీవితానికి యెస్ అంటూ యువత ప్రతిజ్ఞ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News