Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు

Updated : 25 Jun 2026 17:55 IST
As Preferred Source 1 min read
మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు

సంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర మెడికల్ కాలేజీలో నిర్వహించిన “నషా ముక్త్ భారత్ సప్తాహ్–2026” కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జూన్ 17 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ సప్తాహ్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వ్యసన సమస్యలతో బాధపడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 14446 డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, విద్యాశాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news