Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:26 PM

అక్రమ పాఠశాలలపై ఉక్కుపాదం మోపాలి. గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయాలి

25-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుర్రంపోడు మండల కేంద్రంలో ఉన్న లిటిల్ ఛాంపియన్ స్కూల్‌కు ఏడవ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడి) గారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతి లేని తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలపై తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని, నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మోసపోకుండా విద్యాశాఖ పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.

Sthanikam

అక్రమ పాఠశాలలపై ఉక్కుపాదం మోపాలి. గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయాలి

Article Image

గుర్రంపోడు మండల కేంద్రంలో ఉన్న లిటిల్ ఛాంపియన్ స్కూల్‌కు ఏడవ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడి) గారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతి లేని తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలపై తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని, నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మోసపోకుండా విద్యాశాఖ పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News