Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 08:16 PM

సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి..

సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి..

సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి..
June 25, 2026 07:01 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


అధికారులను ఆదేశించిన నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్..

ఎన్‌జీ కళాశాల మైదానంలో పనుల పరిశీలన..

నల్గొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన నేపథ్యంలో ఈ నెల 28న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నల్గొండ పట్టణంలోని ఎన్‌.జీ. కళాశాల మైదానాన్ని సందర్శించి, సభా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా వేదిక నిర్మాణం, గ్యాలరీలు, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా వలయం, విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

వర్షం వచ్చినా ఇబ్బంది కలగకూడదు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. మైదానంలో ఎక్కడా ఎత్తుపల్లాలు లేకుండా మొరం వేసి సమానంగా (లెవలింగ్) చేయాలని అనంతరం గ్రౌండ్ మొత్తం రోలింగ్ చేయించాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడా గుంతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకవేళ వర్షం వచ్చినా మైదానంలో నీరు నిలిచిపోకుండా ఉండేలా ముందస్తుగా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గ్రౌండ్ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయించాలన్నారు. సభా ప్రాంగణం చుట్టూ బలమైన బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని, సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ వేదిక స్పష్టంగా కనిపించేలా ఇరువైపులా ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చాలని చెప్పారు.

సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగించే ప్రధాన వేదికను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తగినంత ఎత్తులో నిర్మించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు నిర్ణీత గడువులోగా తమకు అప్పగించిన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. ​ఈ పరిశీలన కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ పరశురాం మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News