Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:24 AM

వరంగల్‌లో ‘కౌశల్ మహోత్సవ్’.. 5 వేలకుపైగా ఉద్యోగాలు

25-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వరంగల్

తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న వరంగల్‌లో ‘కౌశల్ మహోత్సవ్–2026’ నిర్వహించనున్నారు. కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) ప్రాంగణంలో జరగనున్న ఈ మహోత్సవంలో 5 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండనున్నాయి.

ఈ విషయాన్ని గురువారం కిట్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రిత్వ శాఖ డైరెక్టర్ వి.ఎస్. అరవింద్ వెల్లడించారు. వివిధ రంగాలకు చెందిన 50కుపైగా ప్రముఖ సంస్థలు పాల్గొని యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను పరిశ్రమలతో నేరుగా అనుసంధానం చేయడం, అక్కడికక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించడం, ఉపాధి, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన వారితో పాటు వివిధ నైపుణ్యాలు కలిగిన యువత ఈ మహోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. తయారీ, రిటైల్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఐటీ, ఆరోగ్య సేవలు, పర్యాటకం, టెలికాం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

‘‘ప్రతి నైపుణ్యం కలిగిన యువకుడికి అర్థవంతమైన ఉపాధి అవకాశాలు అందించాలన్నదే మా లక్ష్యం. ఉద్యోగ దాతలు, ఉద్యోగార్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నైపుణ్యాభివృద్ధి నుంచి ఉపాధి వరకు బలమైన అనుసంధానం కల్పిస్తున్నాం’’ అని వి.ఎస్. అరవింద్ పేర్కొన్నారు.

Sthanikam

వరంగల్‌లో ‘కౌశల్ మహోత్సవ్’.. 5 వేలకుపైగా ఉద్యోగాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News