Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:32 PM

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం

25-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు–1, 2 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. సురేష్‌బాబు మాట్లాడుతూ విద్య, క్రమశిక్షణ, సంకల్పబలంతోనే మాదకద్రవ్యాల వ్యసనాన్ని జయించవచ్చని అన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కె. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయని, కానీ ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాలను కలిగి ఉండటం కూడా చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని తెలిపారు. విద్యార్థులు చదువు, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.

మాదకద్రవ్యాల బారిన పడిన వారు సహాయం కోరితే పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాధికారులు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదాదేవి సమన్వయం చేశారు.

కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డా. డి. శ్రీపతి నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News