Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:53 PM

​​లో-వోల్టేజ్ ‘చీకట్లు’ తీరాయి!

​​లో-వోల్టేజ్ ‘చీకట్లు’ తీరాయి!

​​లో-వోల్టేజ్ ‘చీకట్లు’ తీరాయి!
25-06-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* 17వ వార్డులో 160 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

* ఎమ్మెల్యే, చైర్మన్ సహకారంతో సమస్యకు మోక్షం: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

​చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో దీర్ఘకాలంగా వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వార్డులోని విద్యుత్ సమస్యలపై స్థానిక కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు ట్రాన్స్‌కో ఏఈ కి ఫిర్యాదు చేయడంతో అధికారులు తక్షణమే స్పందించారు. గతంలో ఉన్న 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి, దాని స్థానంలో నూతనంగా 160 హెచ్‌పీ సామర్థ్యం గల భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను గురువారం ఏర్పాటు చేశారు.​ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సహకారం, మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని-రమేష్ గౌడ్ సూచనలతోనే ఈ సమస్య పరిష్కారమైందని తెలిపారు. తమ వార్డు ప్రజల ఇబ్బందులను గుర్తించి త్వరితగతిన కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసిన ట్రాన్స్‌కో ఏఈకి, సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.వార్డులో ఉన్న అన్ని ప్రజా సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతాం. 17వ వార్డు పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. వాటిని తప్పకుండా పరిష్కరిస్తాం. అని కౌన్సిలర్ హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాదాని గోపాల్, సైదులు, ట్రాన్స్‌కో సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

​​లో-వోల్టేజ్ ‘చీకట్లు’ తీరాయి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News