Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 PM

ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్లకు నగదు బహుమతులు

25-06-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 25:

చిట్యాల పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గురువారం నగదు పురస్కారాలను అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త కొరివి వెంకన్న విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు.పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి రూ.15 వేల నగదు బహుమతి, తృతీయ స్థానం పొందిన విద్యార్థికి రూ.10 వేల నగదు బహుమతిని అందించారు.

ఈ సందర్భంగా కొరివి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతిభను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమని అన్నారు.

నగదు పురస్కారాలు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్లకు నగదు బహుమతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News