Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 09:16 PM

పాతబస్తీ రౌడీషీటర్లతో సుపారీ హత్యలు కోటి రూపాయల ఆస్తి కోసం ఘాతుకం..

పాతబస్తీ రౌడీషీటర్లతో సుపారీ హత్యలు కోటి రూపాయల ఆస్తి కోసం ఘాతుకం..

పాతబస్తీ రౌడీషీటర్లతో సుపారీ హత్యలు కోటి రూపాయల ఆస్తి కోసం ఘాతుకం..
June 25, 2026 08:00 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఆస్తి కోసం ఒకే కుటుంబంలో నలుగురి ఘోర హత్య!

కుటుంబ కలహాలే కారణం హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు పన్నిన పక్కా కుట్ర..

పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు చిన్నారి అప్సర సహా నలుగురిపై కత్తులతో దాడి..


నల్లగొండ : నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు వ్యక్తుల దారుణ హత్యోదంతం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. కేవలం ఆస్తి కోసం కన్నవారే కసాయిలుగా మారిన వైనం పోలీసు దర్యాప్తులో వెలుగుచూసింది. హసీన పేరు మీద ఉన్న కోటి రూపాయల విలువైన ఆస్తులను దక్కించుకోవడమే లక్ష్యంగా, ఆమె మొదటి భర్త కుమార్తె, అల్లుడు మరియు అల్లుడి అక్క పన్నిన పక్కా ప్లాన్ ఈ ఘాతుకానికి దారితీసిందని పోలీసులు నిర్ధారించారు.

కుట్ర ఇలా సాగింది..

హసీన (40) పేరుపై నల్లగొండలో కోటి రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అయితే, ఆ ఆస్తిని ఇతర వారసులకు కాకుండా, తన ప్రస్తుత భర్త సుల్తాన్ (45) పిల్లలకే ఇవ్వాలని హసీన నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన హసీన మొదటి భర్త కుమార్తె, అల్లుడు, మరియు అల్లుడి అక్క తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆస్తి తమకు దక్కకుండా పోతుందన్న కక్షతో, హసీన కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీషీటర్లకు భారీగా 'సుపారీ' ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది.

పోస్టుమార్టం నివేదికలో భయానక నిజాలు..

నిందితులు ఎంతో క్రూరంగా ఈ హత్యలకు పాల్పడినట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేస్తోంది.​సుల్తాన్ శరీరంపై 6 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. హసీనపై 7 కత్తిపోట్లు, ఆమె కుమారుడు ముజమిల్ (20)పై ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నాయి. ​అందరికంటే దారుణంగా 11 ఏళ్ల చిన్నారి అక్సరపై 9 సార్లు కత్తితో దాడి చేశారు. హంతకుల నుంచి తప్పించుకోవడానికి ఆ చిన్నారి మంచం కింద దాక్కున్నా, ఆమెను బయటకు లాగి మరీ దారుణంగా పొడిచి చంపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

నిందితుల అరెస్టు..

సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా మరియు క్షేత్రస్థాయి విచారణతో పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రధాన సూత్రధారులతో పాటు, ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు రౌడీషీటర్లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని జిల్లా పోలీసులు పేర్కొన్నారు. ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులే సుపారీ ఇచ్చి ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News