Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ హాజరైన నందమూరి రామకృష్ణ, ప్రముఖులు.

25-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడ, జూన్ 25: కోదాడ పట్టణంలోని తమ్మరబండపాలెంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ టీ.డి. జనార్ధన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని, ప్రజల హృదయాల్లో ఆయనకు ఉన్న స్థానం దీనికి నిదర్శనమని అన్నారు. ప్రజా సంక్షేమానికి ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో విశిష్ట ముద్ర వేసిన ఆయన పేదల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. మహిళలకు ఆస్తి హక్కుల కల్పన వంటి నిర్ణయాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు.

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు మాట్లాడుతూ.. అనేక మందికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని చెప్పారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, సామినేని రమేష్, కట్టా సతీష్, తూనం వెంకటేశ్వరరావు, షేక్ మీరా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు నివాళి

Sthanikam

ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ హాజరైన నందమూరి రామకృష్ణ, ప్రముఖులు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News