Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:19 AM

లంచం కేసులో చిక్కిన సబ్‌–రిజిస్ట్రార్‌కు మరో షాక్. రూ.5.05 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ

26-06-2026 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బంగారం, వజ్రాభరణాలు, నగదు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు స్వాధీనం

రూ.30 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి ఇప్పటికే సస్పెండ్ అయిన సబ్‌–రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ క్రెటా కార్లు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ.12 లక్షల నగదు, రూ.38 లక్షల బ్యాంకు డిపాజిట్లు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.5.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

లంచం కేసుతో పాటు ఆదాయానికి మించిన ఆస్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Sthanikam

లంచం కేసులో చిక్కిన సబ్‌–రిజిస్ట్రార్‌కు మరో షాక్. రూ.5.05 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ

Article Image

బంగారం, వజ్రాభరణాలు, నగదు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు స్వాధీనం

రూ.30 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి ఇప్పటికే సస్పెండ్ అయిన సబ్‌–రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ క్రెటా కార్లు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ.12 లక్షల నగదు, రూ.38 లక్షల బ్యాంకు డిపాజిట్లు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.5.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

లంచం కేసుతో పాటు ఆదాయానికి మించిన ఆస్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News