Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:30 PM

ప్రాణాలు కాపాడుతున్నా.. బతుకులు భారమే! చాలీచాలని వేతనాలతో 108 సిబ్బంది ఆవేదన.

26-06-2026 574 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రాణాలు కాపాడుతున్నా.. బతుకులు భారమే!

చాలీచాలని వేతనాలతో 108 సిబ్బంది ఆవేదన

వేతనాల పెంపు కోరుతూ యాజమాన్యానికి విజ్ఞప్తి

ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలిచి ప్రాణాలు కాపాడుతున్న 108 అంబులెన్స్ సిబ్బంది తమ కుటుంబాల పోషణ మాత్రం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహర్నిశలు విధులు నిర్వహిస్తూ అత్యవసర సేవలు అందిస్తున్నప్పటికీ, అందుతున్న వేతనాలు ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, విద్య, వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతుండటంతో నెలాఖరు వరకు జీతం సరిపోవడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగుల కొనుగోలు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ అవసరాలు తీర్చడానికే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వర్షం, ఎండ, రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా సేవలందిస్తున్న తమ సమస్యలను యాజమాన్యం గుర్తించాలని కోరుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలను సవరించి, గౌరవప్రదమైన జీవనం సాగించేలా చర్యలు తీసుకోవాలని జీవీకే (GVK) యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

"ప్రాణాలను కాపాడే చేతులకు.. జీవన భరోసా కల్పించండి" అంటూ 108 అంబులెన్స్ సిబ్బంది తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

Sthanikam

ప్రాణాలు కాపాడుతున్నా.. బతుకులు భారమే! చాలీచాలని వేతనాలతో 108 సిబ్బంది ఆవేదన.

Article Image

మీ స్పందన? 10 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News