Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

ఉద్యోగాల భర్తీపై డీవైఎఫ్‌ఐ నిరసన. సీఎం పర్యటనలో స్పష్టమైన హామీ ఇవ్వాలి.

26-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన నిర్వహించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీలను నమ్మి నిరుద్యోగ యువత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీలో ఆశించిన పురోగతి కనిపించలేదని విమర్శించారు.

యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి, రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీసు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా నిరుద్యోగ యువతకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఉద్యోగ నియామకాలపై కాలపరిమితితో కూడిన కార్యాచరణను ప్రకటించాలని మల్లం మహేష్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నియామక ప్రక్రియ ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్టా లింగస్వామితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యోగాల భర్తీపై డీవైఎఫ్‌ఐ నిరసన. సీఎం పర్యటనలో స్పష్టమైన హామీ ఇవ్వాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News