Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:33 PM

ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు

26-06-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓవర్ బ్రిడ్జి, డిగ్రీ కళాశాల భవనం, ఇంటి పట్టాలపై వినతులు

మాధవరం, : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును మాధవరంలో ఆదోని నియోజకవర్గ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ, యువ నాయకులు మారుతి నాయుడు, భూపాల్ చౌదరి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి ఈ బృందంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదోని పట్టణ రైల్వే పరిధిలో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, పెద్ద హరివనం గ్రామంలోని ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై వంతెన నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

అదేవిధంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ బసాపురం గ్రామంలో ప్రతిపాదిత వంతెన నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల చేయాలని, గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఇంటి పట్టాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని వినతిపత్రం సమర్పించారు.

వినతులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Sthanikam

ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News