Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:32 AM

మత్తు రహిత సమాజమే లక్ష్యం: డీఎస్పీ ప్రసన్నకుమార్

26-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

డీ-అడిక్షన్ కేంద్రంలో బాధితులకు పండ్లు, క్రీడా సామగ్రి పంపిణీ

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ కేంద్రాన్ని డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకట్ సందర్శించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి పండ్లు పంపిణీ చేయడంతో పాటు క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాత నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగుతోందని, గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పరీక్షా కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.

మత్తు వ్యసనాల బారిన పడిన యువత సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి డీ-అడిక్షన్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, బాధితులు స్వచ్ఛందంగా చికిత్స కోసం ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.

మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు డయల్ 100, 112 లేదా 1908 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈగల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది, వైద్యులు, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య పాల్గొన్నారు.

Sthanikam

మత్తు రహిత సమాజమే లక్ష్యం: డీఎస్పీ ప్రసన్నకుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News