Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ

Updated : 26 Jun 2026 19:59 IST
As Preferred Source 1 min read
ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ

నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో మొహర్రం పీర్ల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజ్మా నృత్య కళాకారులకు మాజీ సర్పంచ్ బీరప్పనోరు సురేఖ రాజకుమార్ 15 జతల కలగజ్జల పట్టీలు అందజేశారు. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ వై. పండరి మాట్లాడుతూ, మొహర్రం త్యాగానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు ఐక్యంగా జరుపుకునే పండుగ అని, తెలంగాణ గంగాజమునీ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. షంసొద్దీన్ మాట్లాడుతూ, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడిక్కర్ బాబు, నరుచే మచ్చేందర్, దర్గా వలే షంసొద్దీన్, అశోక్, షరీఫ్, తాజొద్దీన్, సంతోష్, ధర్మ, ఎం. పండరి, మోషిన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా నిర్వహించిన మొహర్రం వేడుకలు.. కళాకారులకు కలగజ్జల పట్టీల పంపిణీ

Article Image

నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో మొహర్రం పీర్ల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజ్మా నృత్య కళాకారులకు మాజీ సర్పంచ్ బీరప్పనోరు సురేఖ రాజకుమార్ 15 జతల కలగజ్జల పట్టీలు అందజేశారు. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ వై. పండరి మాట్లాడుతూ, మొహర్రం త్యాగానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు ఐక్యంగా జరుపుకునే పండుగ అని, తెలంగాణ గంగాజమునీ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. షంసొద్దీన్ మాట్లాడుతూ, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడిక్కర్ బాబు, నరుచే మచ్చేందర్, దర్గా వలే షంసొద్దీన్, అశోక్, షరీఫ్, తాజొద్దీన్, సంతోష్, ధర్మ, ఎం. పండరి, మోషిన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news