చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగడపల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 11 పశువులను (4 ఆవులు, 7 ఎద్దులు) పట్టుకున్నారు.నమ్మదగిన సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా... కోదాడ నుండి హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు మహీంద్రా బొలెరో వాహనంలో (TS 29T 0342) పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ ఎస్‌కే అమీర్ (24, కోదాడ)ను అరెస్ట్ చేసి, యజమాని ఎస్‌కే అక్రం సూచనల మేరకు వీటిని తరలిస్తున్నట్లు నిర్ధారించారు. పశువులతో పాటు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.
PRINT TIME: October 09, 2026 05:56 PM
అక్రమంగా పశువుల తరలింపు: వాహనం సీజ్, ఒకరి అరెస్ట్

26-06-2026
149 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగడపల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 11 పశువులను (4 ఆవులు, 7 ఎద్దులు) పట్టుకున్నారు.నమ్మదగిన సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా... కోదాడ నుండి హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు మహీంద్రా బొలెరో వాహనంలో (TS 29T 0342) పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ ఎస్‌కే అమీర్ (24, కోదాడ)ను అరెస్ట్ చేసి, యజమాని ఎస్‌కే అక్రం సూచనల మేరకు వీటిని తరలిస్తున్నట్లు నిర్ధారించారు. పశువులతో పాటు వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి