Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

ఫీజు బకాయిలు విడుదల చేయాలి.. నార్కట్‌పల్లిలో విద్యార్థుల ధర్నా

27-07-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఫీజుల కోసం ఫైర్.. నార్కట్‌పల్లిలో విద్యార్థుల రాస్తారోకో.

జీవో-9, ఆర్‌ఆర్ యాక్ట్ రద్దుకు డిమాండ్.. పోలీసులతో తోపులాట

నార్కట్‌పల్లి, జూలై 27:

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీవో నెం.9 మరియు ఆర్‌ఆర్ యాక్ట్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆందోళన సందర్భంగా విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, విద్యార్థి నాయకులు–పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తొలగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Sthanikam

ఫీజు బకాయిలు విడుదల చేయాలి.. నార్కట్‌పల్లిలో విద్యార్థుల ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News