Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:10 PM

భక్తుల సౌకర్యమే లక్ష్యం.. సంగమేశ్వర ఆలయం వద్ద మెట్ల నిర్మాణానికి శ్రీకారం

26-07-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం బోరంచ గ్రామంలోని ప్రాచీన శ్రీ సంగమేశ్వర ఆలయం నదీ తీరంలో భక్తుల సౌకర్యార్థం రూ.10 లక్షల ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ (MGNREGS) నిధులతో నిర్మించనున్న మెట్ల పనులకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం ఆలయానికి తరలివస్తుండటంతో వారికి సురక్షితంగా నదిలోకి దిగేందుకు, అలాగే బోటింగ్ ప్లాట్‌ఫారమ్‌ను సులభంగా వినియోగించుకునేందుకు ఈ మెట్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.రాబోయే రోజుల్లో సంగమేశ్వర ఆలయాన్ని మరిన్ని నిధులతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భోజీ రెడ్డి, దిగంబర్ రెడ్డి, సర్పంచ్ బీరప్ప కురుమ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధరెడ్డి, మానూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి రాజు, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

భక్తుల సౌకర్యమే లక్ష్యం.. సంగమేశ్వర ఆలయం వద్ద మెట్ల నిర్మాణానికి శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News