• ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి
బిఆర్ఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్ష పదవిని మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే కేటాయించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మండలంలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న మాదిగలకు ఒక్కసారి కూడా మండల అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం దారుణమన్నారు.పార్టీ నాయకత్వం మాదిగలను కేవలం ఓటర్లుగానే వాడుకుంటూ అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పార్టీలో అధ్యక్ష పదవిని చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్న నాయకులు చాలామంది ఉన్నారన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ అధిష్ఠానం పునరాలోచించి, రాబోయే మండల కమిటీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి