కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలుకి బహిరంగ క్షమాపణ చెప్పాలి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలుకి బహిరంగ క్షమాపణ చెప్పాలి.
P.Venkanna
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ పిలుపు మేరకు ఆదివారం సూర్యాపేట టౌన్ లో ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు పల్లేటి లక్ష్మణ్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ హాజరై తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆ దాడులు ఈరోజు అగ్రవర్ణ సహచర ఎమ్మెల్యే మరొక దళిత ఎమ్మెల్యే ను కూడా కించపరుస్తూ దాడులు చేసే సంస్కృతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి అనే సామాజిక వర్గం చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది రాష్ట్రంలో వారు ఏది అనుకుంటే అదే జరగాలి అనే పంతాలో పయనిస్తుండ్రు దానికి నిదర్శనమే ఈరోజు తుంగతుర్తి లో ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన మందులు సామేలు ని తోటి ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి రెడ్డి అనే కులాహంకారంతో తోటి మాదిగ ఎమ్మెల్యేను నోటికి వచ్చినట్లుగా మాట్లాడి దూషించడం జరుగుతుంది. బహిరంగంగానే ప్రెస్ మీట్ లు పెట్టి మరి వార్నింగు ఇస్తున్నాడు ఇది దేనికి సంకేతంగా మేము పరిగణించాలో మరి రాష్ట్రంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాయకులు చెప్పాలి . అంటే రాబోయే ఎన్నికలలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నారా లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగలు అందరూ మా కాలికింద చెప్పుతో సమానం వాడు కార్యకర్త అయిన ఎమ్మెల్యే అయినా గాని కూడా మేము అలాగే పరిగణిస్తాము అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం
మందుల సామేలు గారికి మీరేదో సహాయం చేసిన అని విర్రవీగుతున్నారు మీరు మాకు సహాయం చేయనవసరం లేదు ఎవడు కూడా మాకు సహాయం చేయనవసరం లేదు ఎందుకంటే మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు రాజ్యాంగ ఫలాలను పొందుపరిచి నారు ఆ రాజ్యాంగం ద్వారానే మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్లు వస్తున్నాయి తప్ప ఎవడి దయ దక్షిణ్యాలతో మేము ఎమ్మెల్యేలను ఎంపీలను కావడం లేదు
ఒకవేళ మీ వల్లనే అయ్యాము అని మీరు భ్రమబడితే అది మీ అహంకారంగానే భావిస్తాము తప్ప మరొకటి కాదు
చేతనైతే మాల మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేయండి అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో దళితుల జోలికి వచ్చిన దళిత నియోజకవర్గం ఎమ్మెల్యేల పైన ఎటువంటి కారు కూతల కూసినా గాని కూడా నాలుక కోస్తామని తెలంగాణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య పక్షాన హెచ్చరిస్తున్నాము ఖబర్దార్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాదిగ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మీద నీ పెత్తనం ఏంటి తగ్గించుకో లేదా రాజకీయ శిక్ష అనుభవిస్తావు మందుల సామేలుని మాజీ ఎమ్మెల్యే అని పేరు పెట్టుకోమని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు ఈసారి మునుగోడులో నీ పరిస్థితి ఏంటో ముందు అది తెలుసుకో ఒక్క మాదిగ ఓటు కూడా నీకు పడనివ్వకుండా చేయగలము జాగ్రత్త బిడ్డ ఖబర్దార్ . ఇంకోసారి నీ మాటలలో గాని నీ చేతలలో గాని నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే అసెంబ్లీ సీట్ల మీద నోరు విప్పితే నీ ఇంటిని ముట్టడి చేస్తామని ఎమ్మార్పీఎస్ తరపున హెచ్చరిస్తున్నాము. మొన్న మందుల సామేలు పై మీరు మాట్లాడిన మాటలకు తెలంగాణలో ఉన్న మాదిగ జాతికి మరియు మందులు సామేలుకి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేనిపక్షంలో నీ ఇంటిని వెయ్యి డబ్బులుతో ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము
అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మాదిగ ఎమ్మెల్యేను కుల అహంకారంతో బహిరంగంగా దూషించినందుకు ఎస్సీ కమిషన్ సుమోటోగా తీసుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఎస్సీ యాక్ట్ కేసు నమోదు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు కనుకు జానయ్య, రాష్ట్ర కార్యదర్శి చింత సైదులు, గూడపూరి ఉపేందర్, యువసేన జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు, జిల్లా నాయకులు మొండి కత్తి లింగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, నూకపంగు కాశయ్య. కందుకూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి