Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:13 PM

ఎస్ ఐ సతీష్ చాకచక్యం.. భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా బట్టబయలు

26-07-2026 253 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో వ్యాన్ పట్టివేత

డ్రైవర్ విచారణతో కీసరలో అక్రమ తయారీ కేంద్రంపై దాడులు

భారీగా కల్తీ పేస్ట్, ముడి పదార్థాలు, యంత్రాలు స్వాధీనం.. కేసు నమోదు

రామన్నపేటలో ఎస్ ఐ జి. సతీష్ అప్రమత్తతతో భారీ కల్తీ అల్లం పేస్ట్ తయారీ, రవాణా దందా గుట్టురట్టైంది. సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో అల్లం పేస్ట్ డబ్బాలను తరలిస్తున్నట్లు గుర్తించారు.

వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ఎస్ ఐ సతీష్ విచారించగా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరలో అక్రమంగా అల్లం పేస్ట్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో, రామన్నపేట సీఐ ఎం. రవి నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కీసరలోని తయారీ కేంద్రంపై సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

తనిఖీల్లో భారీ మొత్తంలో కల్తీ అల్లం పేస్ట్, నాసిరకం ముడి పదార్థాలు, తయారీ యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రి, సిద్ధంగా ఉన్న ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎస్ ఐ అప్రమత్తతతోనే వెలుగులోకి...

సాధారణ వాహన తనిఖీని కూడా నిశితంగా నిర్వహించిన ఎస్సై జి. సతీష్ సమయస్ఫూర్తితోనే ఈ భారీ కల్తీ ఆహార దందా వెలుగులోకి వచ్చింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ఈ చర్యను స్థానికులు అభినందిస్తూ, ఎస్సై సతీష్ అప్రమత్తత వల్లే పెద్ద ఎత్తున కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకట్ట పడిందని ప్రశంసించారు.

Sthanikam

ఎస్ ఐ సతీష్ చాకచక్యం.. భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా బట్టబయలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News