Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:13 PM

వనమహోత్సవంతో పచ్చదనానికి నాగార్జున పాఠశాల శ్రీకారం.

25-07-2026 315 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 25 :

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రామన్నపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలోని నాగార్జున పాఠశాల ఆధ్వర్యంలో శనివారం వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర, భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డా. ఎన్. నాగరాజు మాట్లాడుతూ, చెట్లు భూమికి ఊపిరితిత్తుల వంటివని, మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sthanikam

వనమహోత్సవంతో పచ్చదనానికి నాగార్జున పాఠశాల శ్రీకారం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News