Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:17 PM

విద్యార్థులకు చట్టాలపై సమగ్ర అవగాహన. సమస్యలుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: జడ్జి ఎస్. శిరీష

25-07-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 25 :

విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని తమ హక్కులను కాపాడుకునేలా ముందుకు సాగాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష పిలుపునిచ్చారు. రామన్నపేట మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మునిపంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

విద్యార్థులు పాఠశాలలో కానీ, ఇంటి నుంచి పాఠశాలకు వచ్చే మార్గంలో కానీ ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు ఎదురైనా మౌనంగా ఉండకుండా వెంటనే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, స్థానిక పోలీసు స్టేషన్ లేదా మండల న్యాయ సేవా అధికార సంస్థకు సమాచారం అందించాలని సూచించారు. విద్యా హక్కు చట్టం, బాలకార్మిక నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధం, పోక్సో చట్టం, కార్మిక చట్టాలు, మాదకద్రవ్యాల నివారణ వంటి అంశాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.

ఏజీపీ సుక్క శ్రావణ్ కుమార్, ప్యానల్ అడ్వకేట్లు యాదాసు యాదయ్య, ఎన్. రమేష్ మాట్లాడుతూ విద్యే సమాజాన్ని మార్చే శక్తి అని, విద్యార్థులు చెడు వ్యసనాలు, దారి తప్పించే ఆలోచనలకు దూరంగా ఉండి లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని సూచించారు. సమాజం పట్ల బాధ్యతతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకుంటేనే ఆదర్శ పౌరులుగా ఎదగగలరని పేర్కొన్నారు.ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు రాయపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డి. సరోజ, లీగల్ సర్వీసెస్ సభ్యుడు కురిమేటి యాదయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు చట్టాలపై సమగ్ర అవగాహన. సమస్యలుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: జడ్జి ఎస్. శిరీష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News