Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 03:30 PM

ఆపరేషన్ ముస్కాన్'పై పోలీసుల ఫోకస్. తప్పిపోయిన చిన్నారుల రక్షణకు శాఖల సమన్వయమే కీలకం..

24-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో తప్పిపోయిన, సంరక్షణ అవసరమైన చిన్నారులను గుర్తించి సురక్షితంగా కుటుంబాలకు చేర్చేందుకు చేపడుతున్న 'ఆపరేషన్ ముస్కాన్' అమలును మరింత పటిష్ఠం చేయాలని యాదాద్రి భువనగిరి పోలీసులు నిర్ణయించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం భువనగిరిలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కన్వర్జెన్స్ సమావేశంలో ఈ మేరకు కార్యాచరణపై సమీక్షించారు.అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, రక్షించడం, పునరావాసం కల్పించడం, బాలల సంరక్షణకు సంబంధించిన శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి చిన్నారి భద్రత ప్రభుత్వంతో పాటు సమాజం బాధ్యతేనని, అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని అదనపు ఎస్పీ సూచించారు.ఈ సందర్భంగా డీసీఆర్‌బీ సీఐ హనుమంత్ నాయక్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ జయశ్రీ, సభ్యుడు దశరథ్, ఎన్‌జీఓ ప్రతినిధి సోమ నర్సయ్య, భరోసా ఎస్‌ఐ సంధ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపరేషన్ ముస్కాన్'పై పోలీసుల ఫోకస్. తప్పిపోయిన చిన్నారుల రక్షణకు శాఖల సమన్వయమే కీలకం..

Article Image

జిల్లాలో తప్పిపోయిన, సంరక్షణ అవసరమైన చిన్నారులను గుర్తించి సురక్షితంగా కుటుంబాలకు చేర్చేందుకు చేపడుతున్న 'ఆపరేషన్ ముస్కాన్' అమలును మరింత పటిష్ఠం చేయాలని యాదాద్రి భువనగిరి పోలీసులు నిర్ణయించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం భువనగిరిలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కన్వర్జెన్స్ సమావేశంలో ఈ మేరకు కార్యాచరణపై సమీక్షించారు.అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, రక్షించడం, పునరావాసం కల్పించడం, బాలల సంరక్షణకు సంబంధించిన శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి చిన్నారి భద్రత ప్రభుత్వంతో పాటు సమాజం బాధ్యతేనని, అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని అదనపు ఎస్పీ సూచించారు.ఈ సందర్భంగా డీసీఆర్‌బీ సీఐ హనుమంత్ నాయక్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ జయశ్రీ, సభ్యుడు దశరథ్, ఎన్‌జీఓ ప్రతినిధి సోమ నర్సయ్య, భరోసా ఎస్‌ఐ సంధ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News