విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, రికార్డుల విషయంలో ఆరోపణలు.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
న్యాల్కల్ మండల్ మిర్జాపూర్ (ఎన్) గ్రామ పంచాయతీ కార్యదర్శి విధుల నిర్వహణపై గ్రామానికి చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఇన్‌చార్జి ఎంపీడీఓను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, పంచాయతీకి సంబంధించిన కొన్ని రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే వార్డు సభ్యులతో సరైన సమన్వయం లేకుండా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు చేశారు.పంచాయతీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలితే పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు.గ్రామ పంచాయతీ అభివృద్ధి, ప్రజలకు అందాల్సిన సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఫిర్యాదు అందజేసిన వారిలో రాజు, స్వప్న, జగదీశ్వర్, సువర్ణ తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి