420 హామీలు, 6 గ్యారెంటీల అమలుపై చౌటుప్పల్ లో బీఆర్ఎస్ ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను, 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని నిరసిస్తూ చౌటుప్పల్ లో బీఆర్ఎస్ నాయకులు నిరసన గళం విప్పారు. కేటీఆర్ పిలుపు మేరకు, మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లి చౌటుప్పల్ ఆర్డీవో కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ దగా, అవినీతి, నిరంకుశ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాండూరి పరమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, కౌన్సిలర్లు గడ్డం ఇందిరా రాజారత్నం, ఉదరి యాదయ్య, మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఉడుగు మల్లేష్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్, నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి, అత్తార్ పాషా, చెవగోని మహేష్ గౌడ్, ఎండీ మున్నా, మెట్టు మహేశ్వర్ రెడ్డి, బొమ్మగోని మల్లేష్ గౌడ్, ఎండీ ముషీర్, సంగిశెట్టి శివ, రఘు, ఎండీ అబ్బాస్, ఇమ్మడి ఈశ్వర్ గుప్తా, ఎండీ అత్తు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి