చౌటుప్పల్ ఆర్డీవోకు ఆర్‌టీఐ కార్యకర్తల వినతి
పీఐఓలు బాధ్యతాయుతంగా సమాచారం అందించాలని డిమాండ్
చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం (RTI) బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్‌టీఐ కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ గౌస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో ఆయన అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డివిజన్ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పాత బోర్డులలోని అధికారుల పేర్లను ఇప్పటికీ మార్చలేదని, కొన్ని శాఖల్లో అసలు ఆర్టిఐ బోర్డులే లేవని పేర్కొన్నారు. ముఖ్యంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని జూనియర్ సివిల్ కోర్టులో నేటికీ సమాచార హక్కు చట్టం-2005 బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్ల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకోవడానికి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం అందేలా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను ఆర్డీవో ఆదేశించాలి. అన్ని శాఖల్లో పాత బోర్డుల స్థానంలో నూతన అధికారుల వివరాలతో కూడిన ఆర్‌టీఐ బోర్డులు పునరుద్ధరించాలి. గత ప్రభుత్వ హయాంలో సమాచార హక్కు చట్టంపై ప్రభుత్వపరంగా సరైన అవగాహన సదస్సులు నిర్వహించలేదని, ఈసారి వచ్చే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సామాజిక కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ అధికారులు అధికారికంగా నిర్వహించాలని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి