Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 07:06 PM

స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్లగొండకు జాతీయ ఘనత

07-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేశంలోనే రెండో ర్యాంక్‌.. రూ.20 లక్షల నగదు బహుమతితో జాతీయ అవార్డు.

నల్లగొండను తెలంగాణలో నంబర్‌–1 కార్పొరేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం.

నల్లగొండ: స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించింది. గాలి నాణ్యత మెరుగుదల, రహదారి దుమ్ము నియంత్రణ, పచ్చదనం పెంపు, పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ వంటి చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో నల్లగొండకు లభించిన ఈ ఘనత నగరవాసుల్లో ఆనందం, గర్వాన్ని నింపింది.

నగరంలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన పలు కార్యక్రమాలు అవార్డు సాధనలో కీలకంగా నిలిచాయని మేయర్‌ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్ల (GVP) రూపాంతరం, ఎంఆర్‌ఎఫ్‌ ప్లాంట్‌ వంటి చర్యలు నగర పరిశుభ్రతకు దోహదపడ్డాయని తెలిపారు.నగర అభివృద్ధికి సహకరిస్తున్న నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రూ.20 లక్షల నగదు బహుమతితో పాటు జాతీయ అవార్డును స్వీకరించడం నల్లగొండకు గర్వకారణమన్నారు.

నల్లగొండను స్వచ్ఛమైన, పచ్చని, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్ది తెలంగాణలోనే నంబర్‌–1 కార్పొరేషన్‌గా నిలపడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్లగొండకు జాతీయ ఘనత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News