ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చట్టపరమైన పరిష్కారం అందించడమే ప్రజావాణి ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజావాణిలో ఎస్పీ

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి