హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంతాపూర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల ఆమీనాబీ సోమవారం ఉదయం తన కూతురు నివాసం ఉన్న వడ్డీ గ్రామానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ సమాచారం లభించకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె మనవడు తాహిర్‌బీ హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేవలం నాలుగు గంటల్లోనే ఆమీనాబీ ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. పోలీసుల చురుకైన చర్యలతో వృద్ధురాలి ఆచూకీ త్వరగా లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ తెలిపారు.
PRINT TIME: September 07, 2026 06:59 PM
నాలుగు గంటల్లో వృద్ధురాలి ఆచూకీ.. కుటుంబ సభ్యులకు అప్పగింత

07-09-2026
40 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంతాపూర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల ఆమీనాబీ సోమవారం ఉదయం తన కూతురు నివాసం ఉన్న వడ్డీ గ్రామానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ సమాచారం లభించకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె మనవడు తాహిర్‌బీ హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేవలం నాలుగు గంటల్లోనే ఆమీనాబీ ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. పోలీసుల చురుకైన చర్యలతో వృద్ధురాలి ఆచూకీ త్వరగా లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి