చిట్యాల: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుమేరకు చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసేందుకు అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకుని ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేపీ నాయకులు ఖండించారు.ముందస్తు అరెస్టయిన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, బీజేవైఎం నాయకులు పాల రవివర్మ, నూకేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి