Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 07:01 PM

గణేష్‌ మండపాల నిర్వహణకు ఆన్‌లైన్‌ అనుమతులు తప్పనిసరి

07-09-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పోలీస్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి: సీఐ మన్మథకుమార్‌

అత్యవసర వేళల్లో 100 / 112కు సమాచారం ఇవ్వాలని వినతి

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్‌ మండపాలకు పోలీస్‌ శాఖ అనుమతులను ఆన్‌లైన్‌ విధానంలోనే పొందాలని చౌటుప్పల్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఉత్సవ నిర్వాహకులు ముందుగా తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తులో మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలు, పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలి. అధికారులు పరిశీలించిన అనంతరం ఆన్‌లైన్ ద్వారానే QR/డిజిటల్ NOC జారీ చేస్తారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలు నిర్మించాలి. విద్యుత్ భద్రత, అగ్నిప్రమాదాల నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ, ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవడానికి పోలీసులకు సహకరించాలి. ఎలాంటి సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే 100 లేదా 112 సంఖ్యలకు సమాచారం అందించాలని సీఐ కోరారు.

Sthanikam

గణేష్‌ మండపాల నిర్వహణకు ఆన్‌లైన్‌ అనుమతులు తప్పనిసరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News