Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 07:00 PM

అక్రమ అరెస్టులను ఖండించండి: డీవైఎఫ్‌ఐ

అక్రమ అరెస్టులను ఖండించండి: డీవైఎఫ్‌ఐ

అక్రమ అరెస్టులను ఖండించండి: డీవైఎఫ్‌ఐ
07-09-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి.

చిట్యాల, సెప్టెంబర్‌ 7: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా డీవైఎఫ్‌ఐ నాయకులు మల్లం మహేష్, గోలి సాయికిరణ్‌లను సోమవారం ఉదయం పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని డీవైఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదని పేర్కొంది.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్‌ శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 7,437 పోస్టులను మాత్రమే భర్తీ చేయడం వల్ల నిరుద్యోగులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.

అలాగే జీవో నంబర్‌ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. డీవైఎఫ్‌ఐ నాయకుల అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాపాడాలని మల్లం మహేష్ డిమాండ్ చేశారు.

Sthanikam

అక్రమ అరెస్టులను ఖండించండి: డీవైఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News