చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కొండూరు రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన "శ్రీ లక్ష్మీనరసింహస్వామి డయాగ్నస్టిక్ ల్యాబ్"ను చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సోమవారం వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ... చౌటుప్పల్ పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలతో డయాగ్నస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొనాలన్నారు. ల్యాబ్ యాజమాన్య ప్రతినిధులు డాక్టర్ సామ వర్షిని రెడ్డి, నవీన్ రెడ్డిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్, బొడ్డు మోహన్ రెడ్డి, బొడ్డు ఉపేంద్ర, శ్రీధర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభం

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి