Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్‌ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 08:01 PM

చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్య ఖూనీ

చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్య ఖూనీ

చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్య ఖూనీ
07-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న

అప్రజాస్వామిక, నిరంకుశ పోకడలపై,

ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ‘కౌరవ సభ’గా మార్చిందని ధ్వజమెత్తుతూ, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో కోదాడ పట్టణ కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను సభకు రాకుండా పోలీసు బలగాలతో అక్రమంగా అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారు మరియు మాజీ మంత్రి, సీనియర్ నేత శ్రీ తన్నీరు హరీష్ గారిపై పోలీసులు ప్రదర్శించిన దురుసు ప్రవర్తన, దాష్టీకాన్ని ఖండించారు. కనీసం మహిళా ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా, మహిళల పట్ల పాటించాల్సిన నైతిక విలువలను పక్కనబెట్టి పోలీసులతో భౌతిక దాడులు చేయించడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటనిబొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తుపాకీలు, లాఠీలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. అదేవిదంగా బీఆర్ఎస్ అగ్రనేతలు, మహిళా ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు తెగబడిన పోలీసులపై తక్షణమే శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ దారుణ ఘటనకు

ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రజలకు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు.

Sthanikam

చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్య ఖూనీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News