హెచ్ సిఏ ఉమెన్ లీగ్ అండర్-19 ఎఫ్ జట్టు పగ్గాలు సింధుజను వరించిందని అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఉమెన్స్ అండర్-19 క్రికెట్ లీగ్ పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన ప్రతిభావంతమైన క్రీడాకారిణి నాగార్జునపు సింధుజ ఎంపికయ్యారు. అంతేకాకుండా ఆమెను హెచ్ సిఏ ఉమెన్స్ అండర్-19 ఎఫ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం.ఈ రాష్ట్రస్థాయి లీగ్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి రాష్ట్రస్థాయి పోటీల్లో జట్టుకు నాయకత్వం వహించే స్థాయికి ఎదగడం పట్ల కోదాడ క్రికెట్ అకాడమీ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్ధిఖ్ మాట్లాడుతూ..నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారని తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్న ప్రోత్సాహం, సహకారం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ మరింత విస్తరిస్తోందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయిలో మంచి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సయ్యద్ అమీన్‌ఉద్దీన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి అవకాశాలు కల్పించడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కోచ్ సిద్ధిఖ్ అన్నారు. నాగార్జునపు సింధుజ ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం సుగుణ కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. చదువుతో పాటు క్రికెట్‌లోనూ రాణిస్తూ హెచ్ సిఏ అండర్-19 ఎఫ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం ఆమె ప్రతిభకు నిదర్శనమని కోచ్ షేక్ సిద్ధిఖ్ తెలిపారు. సింధుజ ఎంపిక పట్ల కోదాడ క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సలీం షరీఫ్, అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్, డాక్టర్ నందకిషోర్, ట్రెజరర్ ఖాజామియా, సతీష్, బడుగుల సైదులు, హమీద్, సురేష్, శంకర్, బుల్లయ్య, శ్రీకాంత్, శ్రీను, బాల్ రాజు తదితరులు హర్షం వ్యక్తం చేసి, సింధుజకు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కోదాడకు, నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
హెచ్ సిఏ అండర్-19 మహిళల రాష్ట్రస్థాయి క్రికెట్ లీగ్‌కు నాగార్జునపు సింధుజ ఎంపిక

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి