Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:25 PM

టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం.

08-09-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సర్వే నంబర్‌ 649లో 1.12 ఎకరాకు హద్దులు నాటిన రెవెన్యూ అధికారులు.

చిట్యాల: టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి సంబంధించిన భూమికి ఎట్టకేలకు హద్దులు నిర్ణయించారు.

చిట్యాల పట్టణ పరిధిలోని సర్వే నంబర్‌ 649లో ఉన్న 1 ఎకరం 12 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే చేసి హద్దులను నిర్ధారించారు. అనంతరం భూమి సరిహద్దులను గుర్తించేలా కడీలు నాటించారు.

భూమి సర్వే అనంతరం అధికారులు హద్దులను స్పష్టంగా గుర్తించారు. టీటీడీ కల్యాణ మండపం కోసం కేటాయించిన భూమికి సంబంధించి గతంలో నెలకొన్న వివాదాలు, భూమి హద్దులపై ఉన్న సందేహాలకు ఈ చర్యతో స్పష్టత వచ్చినట్లయింది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, నిర్దేశిత విస్తీర్ణానికి కడీలు ఏర్పాటు చేశారు.

టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి ఉద్దేశించిన భూమి రక్షణకు హద్దుల ఏర్పాటు కీలకంగా మారింది. భవిష్యత్తులో భూమి ఆక్రమణలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News