Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:37 PM

నాగం శ్రీదేవిరెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

08-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ఇటీవల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై దాడికి పాల్పడిన ఘటనలో ఆయన తల్లి నాగం శ్రీదేవిరెడ్డి భయాందోళనకు గురై గాయపడ్డారని బీజేపీ నాయకులు తెలిపారు. అనంతరం అనారోగ్యానికి గురై గుండె నొప్పితో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంగళవారం చిట్యాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.చిట్యాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, నాగం శ్రీదేవిరెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, సీనియర్ నాయకులు కన్నబోయిన మహాలింగ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గంజి గోవర్ధన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్నగౌడ్, జయరాపు రామకృష్ణ, బీజేపీ నాయకులు గోషిక వెంకటేశం, కంచర్ల శంకర్‌రెడ్డి, బీజేపీ యువ నాయకుడు నీలం మధుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నాగం శ్రీదేవిరెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News