Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:15 PM

ఎల్బీనగర్‌లో ఎం ఆర్ పి ఎస్ నిరసన

ఎల్బీనగర్‌లో ఎం ఆర్ పి ఎస్ నిరసన

ఎల్బీనగర్‌లో ఎం ఆర్ పి ఎస్ నిరసన
25-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం ఎల్బీనగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జగ్జీవన్ రాం విగ్రహల వద్ద దళిత, బీసీ సంఘాల నాయకులు నిరసన చేసారు. తెలంగాణ దళిత సంఘాల జేఏసీ ఛైర్మన్ ఈదుల పరశురామ్ మాదిగ, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. శామ్యూల్ ఉద్యమ కాలం నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ, పోరాటాల ద్వారా ప్రజా నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. తానే టికెట్ ఇప్పించానని, డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత మూడు దశాబ్దాలుగా దళితులకు సరైన ప్రాతినిధ్యం, మంత్రి పదవులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజగోపాల్ రెడ్డి వెంటనే మందుల శామేలుకు, తుంగతుర్తి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే మునుగోడు నియోజకవర్గంలోని దళితులను ఏకం చేసి కోమటిరెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంకా ఆధిపత్య రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధుల గురించి "మేమే టికెట్ ఇచ్చాం, మేమే ఎమ్మెల్యేలను చేశాం" అని మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వనరుల పరిరక్షణ సమితి గోరా.శ్యాంసుందర్ గౌడ్ తెలంగాణ దళిత స్టూడెంట్ ఫెడరేషన్ మచ్చగిరి, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్బీనగర్‌లో ఎం ఆర్ పి ఎస్ నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News