Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:11 PM

అక్రమంగా పశువుల రవాణా.. పట్టుకున్న పోలీసులు

25-07-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

10 పశువులతో పాటు వాహనం స్వాధీనం

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు శనివారం పట్టుకున్నారు. స్థానిక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పోలీస్ స్టేషన్ పరిధిలోని తూప్రాన్‌పేట్ రహదారి వద్ద హెచ్‌సీ నరేష్, కానిస్టేబుల్ శ్రీహరిలు పెట్రో మొబైల్-2 విధుల్లో ఉన్నారు. అనుమానాస్పదంగా వస్తున్న అశోక్ లైలాండ్ మినీ వాహనాన్ని (TG 12 U 4443) తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 10 పశువులు (4 ఆవులు, 6 ఎద్దులు) బయటపడ్డాయి. డ్రైవర్ మొహమ్మద్ అలీ (26) ని విచారించగా, యజమాని మొహమ్మద్ యూసఫ్ (28)తో కలసి వీటిని కోదాడ పశువుల సంతలో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. నిందితులు ఇద్దరూ హైదరాబాద్‌లోని బహదూర్‌పురా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. పశువులను, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

అక్రమంగా పశువుల రవాణా.. పట్టుకున్న పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News