Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

జలసిరితో భూగర్భ జలాల సంరక్షణకు గ్రామస్థులు ముందుకు రావాలి

25-07-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 25:

భూగర్భ జలాలను పరిరక్షిస్తూ వర్షపు నీటిని ఒడిసిపట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'జలసిరి' పథకాన్ని ప్రతి గ్రామస్థుడు సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల మండల ఏపీవో వనం శ్రీలత పిలుపునిచ్చారు.

చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో సర్పంచ్ సాగర్ల భానుశ్రీ–భిక్షం అధ్యక్షతన స్థానిక వీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన జలసిరి అవగాహన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ పథకం కింద మ్యాజిక్ సోక్ పిట్స్, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, కాంపౌండ్ ఊట కుంటలు వంటి నీటి సంరక్షణ పనులను చేపట్టే అవకాశం ఉందని వివరించారు.

పథకం ప్రయోజనాలు పొందాలనుకునే ప్రతి కుటుంబం జాబ్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, ఇంటి ముందు ఫోటో తీసుకుని గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా సర్పంచ్‌కు అందజేయాలని సూచించారు.సర్పంచ్ సాగర్ల భానుశ్రీ–భిక్షం మాట్లాడుతూ, గ్రామంలో ఎక్కువ సంఖ్యలో కుంటలు తవ్వించి వర్షపు నీటిని నిల్వ చేసి జలసిరిని ఒడిసిపట్టేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామస్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అలేందర్ రెడ్డి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, వీవో పాకాల సత్యనారాయణ, అధ్యక్షురాలు జనపాల మమత, బెల్జ అరుణ్, ఉపాధి హామీ మేట్స్ జనపాల మల్లిక, రేణుక, వనజ, రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జలసిరితో భూగర్భ జలాల సంరక్షణకు గ్రామస్థులు ముందుకు రావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News