Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 24, 2026 08:18 PM

22 రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి – ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి: 22 వ తారీకు హెడ్డింగ్ సాంకేతిక లోపం వల్ల తప్పుగా పడింది.

22 రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి – ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి: 22 వ తారీకు హెడ్డింగ్ సాంకేతిక లోపం వల్ల తప్పుగా పడింది.

22 రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి – ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి: 22 వ తారీకు హెడ్డింగ్ సాంకేతిక లోపం వల్ల తప్పుగా పడింది.
July 24, 2026 05:41 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
  1. నల్గొండ కలెక్టరేట్ ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉధృతంగా రీలే నిరాహార దీక్ష
  2. ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత
  3. 22 రోస్టర్ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపణ
  4. డిమాండ్లతో జిల్లా కలెక్టర్‌కు సమగ్ర వినతిపత్రం సమర్పించిన ప్రతినిధి బృందం

నల్గొండ, జూలై 22:ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గానికి జరుగుతోందని ఆరోపిస్తున్న అన్యాయాన్ని తక్షణమే అరికట్టాలని, ముఖ్యంగా ప్రస్తుతం అమలులో ఉన్న22 రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ మాల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భారీ రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాలపల్లి రవి నాయకత్వంలో, మాల సంఘాల జేఏసీ చైర్మన్మందాల భాస్కర్, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులుబొప్పని నగేష్ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

22 రోస్టర్ వల్ల అవకాశాలు కోల్పోతున్నాం: మాల మహానాడు

దీక్షా శిబిరంలో ప్రసంగించిన నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన 22 రోస్టర్ విధానం కారణంగా విద్యా ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మాల సామాజిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు. ప్రతిభ, అర్హత ఉన్నప్పటికీ రోస్టర్ అమలు విధానం కారణంగా మాల యువతకు అవకాశాలు దూరమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ విధానాన్ని తక్షణమే సవరించి, 1 నుంచి 16 రోస్టర్ పాయింట్లలో మాలలకు రెండు స్థానాలు కల్పించేలా మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే నిర్ణయాలు వద్దు: తాలపల్లి రవి

ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాలపల్లి రవి మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి, సమానత్వ హక్కులకు విరుద్ధమని ఆరోపించారు. దళిత సమాజాన్ని విభజించే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించాలని కోరారు. ఎస్సీల మధ్య విభజన రేఖలు గీయకుండా సమైక్యతను కాపాడే విధానాలే అమలు చేయాలని సూచించారు. మాలలకు జరుగుతోందని భావిస్తున్న అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మాలల హక్కులను కాలరాస్తే ఊరుకోం: మందాల భాస్కర్ – బొప్పని నగేష్

మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ, 22 రోస్టర్ విధానం విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. మాల వర్గానికి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులుబొప్పని నగేష్ మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మాలలంతా తమ హక్కుల కోసం ఏకమయ్యారని, సమస్య పరిష్కారం కాకపోతే నల్గొండ నుంచే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

కలెక్టర్‌కు సమగ్ర వినతిపత్రం – నాలుగు ప్రధాన డిమాండ్లు

దీక్ష ముగిసిన అనంతరం తాలపల్లి రవి, మందాల భాస్కర్, బొప్పని నగేష్ నాయకత్వంలోని ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసి సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించింది. వినతిపత్రంలో ప్రధానంగా నాలుగు డిమాండ్లు పొందుపరిచారు.

  1. 22 రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించి మాలలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలి.
  2. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్ష చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి.
  3. దళిత సామాజిక వర్గాల మధ్య సమైక్యతను కాపాడే విధానాలు అమలు చేయాలి.
  4. మాలల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.

డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం

తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రీలే నిరాహార దీక్షలను మరింత విస్తరించి, జిల్లాల వారీగా కలెక్టరేట్ల ముట్టడులు, భారీ ధర్నాలు, హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి మహా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పెద్ద ఎత్తున నాయకుల పాల్గొనడం

ఈ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు గౌరవ అధ్యక్షులు ఏకుల రాజారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిచింతపల్లి లింగమయ్య, జిల్లా కార్యదర్శి వెన్నెమళ్ల అనిల్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేరా బాలకిషన్, హంస అధ్యక్షులు నామా సైదులు, మాడుగుల శ్రీనివాస్, చిలుకూరి అభినవ్, వేణు బలరామ్, కట్ట మురళి, బాలకృష్ణ, బొగారి అనిల్, ఏకుల సురేష్, బోయిళ్ల చంద్రమౌళి, బాల్‌పల్లి సురేష్, వనపట్ల శోభ, అంగరాజు స్వప్నలత, పిడతల శ్రీనివాస్, మర్రి జోజి, నాగరాజు, సామ సైదులు, జక్క నాగరాజు, తాళ్లపల్లి మీన్నయ్య, చింతపల్లి శేఖర్, భూతం అర్జున్, గాదరి మధు, తిరుమళ్ల జీవన్ కుమార్, బేరి గురుపాదం, చింతపల్లి వెంకన్న, నాగటి జోసఫ్, కొర్లపాటి చిరంజీవి, ముడుసు జాకబ్ ప్రతాప్, మన్నే శ్రీధర్ రావు, తాలూకా రాజేష్, గోపోజు రమేష్ బాబు, తాలూకా అనిల్ తదితర నాయకులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ మండలాల మాల మహానాడు నాయకులు, జేఏసీ ప్రతినిధులు, దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

* ముఖ్య గమనిక*

22వ తారీకు వచ్చిన వార్తలో హెడ్డింగ్ సాంకేతిక లోపం వల్ల మిస్సై పడింది.. కుల సంఘాల నాయకులు తప్పుగా భావించకండి.

మా నెట్వర్క్ ఇష్యూ వల్ల అలా జరిగింది. మళ్లీ ఇలాంటి తప్పులు జరగమని హామీ ఇస్తున్నాము.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News