Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:38 PM

గీతన్నల హక్కుల కోసం చైతన్య యాత్ర. ఆగస్టు 9న రామన్నపేటకు బస్సు యాత్ర.. విజయవంతం చేయాలి.గాజుల ఆంజనేయులు.

24-07-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ‘గీతన్నల చైతన్య బస్సు యాత్ర’ను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజుల ఆంజనేయులు పిలుపునిచ్చారు. రామన్నపేట మండల కల్లుగీత కార్మిక సంఘం సమావేశం కూనూరు మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 9న రామన్నపేటకు చేరుకోనున్న చైతన్య బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఆంజనేయులు మాట్లాడుతూ.. ఆగస్టు 2 నుంచి 18 వరకు మానుకోట నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు కల్లుగీత అమరుల స్ఫూర్తితో చేపడుతున్న చైతన్య బస్సు యాత్రలో భాగంగా రామన్నపేటలో భారీగా కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

కల్లుగీత కార్మికుల వృత్తి రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించి తగిన నిధులు కేటాయించాలని, ప్రమాదాలకు గురైన కార్మికులకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ప్రభుత్వ బీమా, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు.

అలాగే ఆసరా పెన్షన్‌ను రూ.4 వేలకు, వికలాంగులైన గీత కార్మికులకు రూ.6 వేల పెన్షన్‌కు పెంచాలని, వృత్తి నిర్వహణకు అవసరమైన భద్రతా పరికరాలు, సామగ్రి, ద్విచక్ర వాహనాలను ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి బావండ్లపల్లి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కూనూరు మల్లేశం, మునికుంట్ల లెనిన్తో పాటు మండల నాయకులు పబ్బు సత్తయ్య, పబ్బు వెంకన్న, పబ్బు శేఖర్, గంగాదేవి అంజయ్య, పల్సం కనకయ్య, పల్లె సత్యం, పబ్బు స్వామి, కూనూరు మహేష్, బావండ్లపల్లి సత్యం, కూనూరు అంజయ్య, సుర్వి నవీన్, గోపగోని శంకరయ్య, గంగాపురం గోపాల్, గోపగోని వీరస్వామి, కమ్మగాని అశోక్, వీరమల్ల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గీతన్నల హక్కుల కోసం చైతన్య యాత్ర. ఆగస్టు 9న రామన్నపేటకు బస్సు యాత్ర.. విజయవంతం చేయాలి.గాజుల ఆంజనేయులు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News