Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 03:32 PM

రామన్నపేటలో పోలీసుల వెహికల్ చెకింగ్. సీఐ,ఎస్ ఐ ల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు.

24-07-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

నేరాల నియంత్రణ, రహదారి భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణను పటిష్ఠం చేసే లక్ష్యంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో పోలీసులు శుక్రవారం విస్తృత స్థాయిలో ప్రత్యేక వెహికల్ చెకింగ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మోలుగురి రవి ఆధ్వర్యంలో ఎస్ ఐ జి. సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలను పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేశారు.

సీఐ మోలుగురి రవి మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, నేరాలకు అడ్డుకట్ట వేయడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగానే ఈ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sthanikam

రామన్నపేటలో పోలీసుల వెహికల్ చెకింగ్. సీఐ,ఎస్ ఐ ల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు.

Article Image

రామన్నపేట,

నేరాల నియంత్రణ, రహదారి భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణను పటిష్ఠం చేసే లక్ష్యంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో పోలీసులు శుక్రవారం విస్తృత స్థాయిలో ప్రత్యేక వెహికల్ చెకింగ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మోలుగురి రవి ఆధ్వర్యంలో ఎస్ ఐ జి. సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలను పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేశారు.

సీఐ మోలుగురి రవి మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, నేరాలకు అడ్డుకట్ట వేయడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగానే ఈ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News