Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:44 PM

నీట్ వివాదంపై డీవైఎఫ్‌ఐ–ఎస్ఎఫ్‌ఐ ఆందోళన

నీట్ వివాదంపై డీవైఎఫ్‌ఐ–ఎస్ఎఫ్‌ఐ ఆందోళన

నీట్ వివాదంపై డీవైఎఫ్‌ఐ–ఎస్ఎఫ్‌ఐ ఆందోళన
24-07-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్.. విద్యాసంస్థల బంద్‌కు పిలుపు.

చిట్యాల: నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డీవైఎఫ్‌ఐ, ఎస్ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి వడ్డగోని మహేష్, ఎస్ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ మాట్లాడుతూ, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్‌టీఏ వ్యవస్థను రద్దు చేసి పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని కోరారు. గత నాలుగు–ఐదు సంవత్సరాలుగా నీట్ పరీక్షల్లో చోటుచేసుకుంటున్న పేపర్ లీకేజీల కారణంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాస్త్రవేత్త సోనం వాంగ్‌చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆ దీక్షకు మద్దతుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో మాజీ చిట్యాల మండల కార్యదర్శులు జిట్టా సురేష్, జిట్టా దినేష్, ఎల్‌డీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బడే అజయ్, ఎస్ఎఫ్‌ఐ నాయకులు జిట్టా హరీష్, గోలి అరుణ్, చంటి, మనోహర్, విన్ను, యశ్వంత్, కార్తీక్, విఘ్నేష్తో పాటు విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నీట్ వివాదంపై డీవైఎఫ్‌ఐ–ఎస్ఎఫ్‌ఐ ఆందోళన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News