Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 03:46 PM

బైక్ దొంగతనాలతో గంజాయి దందా.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

25-07-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రూ.10 లక్షల విలువైన గంజాయి, వీడ్ ఆయిల్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..

నల్గొండ: ఒడిశా నుంచి గంజాయి, వీడ్ (హాష్) ఆయిల్‌ను అక్రమంగా తరలిస్తూ యువతను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 8 మంది నిందితులతో పాటు ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకుని, రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ఎంఎల్ వీడ్ ఆయిల్, 5 బైక్‌లు, 4 సెల్‌ఫోన్లు, డమ్మీ తుపాకీ, బటన్ చాకు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రత్యేక ఆదేశాల మేరకు, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు మునుగోడు బైపాస్ వద్ద నిర్వహించిన దాడిలో ముఠాను పట్టుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి, కళాశాల విద్యార్థులు, యువతకు చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు, గంజాయి కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది.ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

ఈ కేసును విజయవంతంగా ఛేదించిన వన్‌టౌన్ పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జిల్లాలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

బైక్ దొంగతనాలతో గంజాయి దందా.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News